రేపు మంత్రుల ప్రమాణస్వీకారం.. ఆ వెంటనే భేటీ..

రేపు మంత్రుల ప్రమాణస్వీకారం.. ఆ వెంటనే భేటీ..

శనివారం ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు... ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు.. 20 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేపు సచివాలయంలో తొలిసారి అడుగుపెట్టనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. తదనంతరం కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం.. ఆ తర్వాత సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. 

ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత 8.42 గంటలకు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 8.50 గంటలకు కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సీఎం సంతకాలు చేస్తారు. అనంతరం 9.15 గంటలకు సచివాలయం గ్రౌండ్‌కు చేరుకుని ఉదయం 11.30 గంటల వరకు అక్కడే ఉంటారు. కాగా, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఉదయం 9.50 గంటలకు మొదలుకానుంది... ఇక ఆ తర్వాత ఉదయం 11.49 గంటలకు వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశం కానుంది.