అగ్రి గోల్డ్‌ బాధితులకు బాసట..

అగ్రి గోల్డ్‌ బాధితులకు బాసట..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. బాధితులకు రూ.250 కోట్లు ముందస్తుగా చెల్లించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే రూ.500 కోట్ల డిపాజిట్లు ఉండడంతో మొత్తం కలిపి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోబోతున్నారు. చిన్న మొత్తాలవారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయానికి మెమో ద్వారా కోర్టుకు తెలియజేయనున్నారు. దశలవారీగా అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును కూడా హైకోర్టు అనుమతితో బాధితులకు పంపిణీ చేయనున్నట్టు కేబినెట్ ముగిసిన తర్వాత మీడియాకు వెల్లడించారు మంత్రి కాల్వ శ్రీనివాసులు.