కాపు రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం..

కాపు రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న చాలా సమస్యలకు ఏపీ కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. రాజకీయాలను కుదిపేస్తున్న కాపు రిజర్వేషన్లపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు (ఈబీసీ) పరిధిలోకి కాపులకు తీసుకొచ్చి... వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. మిగతా ఐదు శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణ పేదలకు కేటాయిస్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారు. కాపు రిజర్వేషన్ల బిల్లును ఇప్పటికే కేంద్రానికి పంపాం కాబట్టి... ఇక ప్రత్యేకంగా చట్టం అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కాపులు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్లే ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కాల్వ శ్రీనివాసులు.