ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ భేటీ.. పలుకీలక అంశాలపై నిర్ణయం

ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ భేటీ.. పలుకీలక అంశాలపై నిర్ణయం

ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరనుంది...సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది..సమావేశానికి సంబంధించిన ప్రతిపాదిత అంశాలను 9 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది...
ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయలు తీసుకునే  అవకాశం ఉంది...లాక్‌డౌన్‌ అమలు,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలకంగా చర్చించనున్నారు...పోతిరెడ్డి వివాదం, నిమ్మగడ్డ రమేష్ వివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి..రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.