రాత్రి 10కి ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం..అందుకేనా ?

రాత్రి 10కి ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం..అందుకేనా ?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంటున్న నేపథ్యంలో మండలిని రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించినట్లు కూడా సమాచారం. టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు వార్తల్ని కొట్టి పారేస్తోంది. శాసనమండలిని జగన్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వస్తున్న వ్యాఖ్యలపై అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రులు యనమల, నారా లోకేష్ మీడియాతో మాటలాడారు. మండలి రద్దు అనేది అంత సులభమైన ప్రక్రియ కాదని, పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యం అవుతున్నందన్నారు. శాసన మండలిని రద్దు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుందన్నారు యనమల. మండలి రద్దు చేస్తారంటే టీడీపీ సభ్యులు ఎవరూ ఈ విషయంలో భయ పడటం లేదన్నారు నారా లోకేష్.