'ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదు'

'ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదు'

ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిల మాట్లాడుతూ... ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదు.. సాధారణ రోజుల్లో బదిలీ జరిగినా ఎలాంటి కారణాలు చెప్పరు కదా..! అని అన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేది.. బదిలీ చేసింది సీఈసీ అయితే నాకు లేఖ రాసి ఏమి ప్రయోజనం..? అని గోపాల కృష్ణ ప్రశ్నించారు.

సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ వివరణ ఇచ్చాం అని గోపాల కృష్ణ తెలిపారు. ఎన్నికల గుర్తులు మార్చడం అనేది ఇప్పుడు వీలు కాదన్నారు. కేఏ పాల్ కు భద్రత పెంచమని పోలీసులకు సూచించాం. జగన్ బెయిల్ రద్దు మా పరిధిలో ఎందుకు ఉంటుంది..? కోర్టును ఆశ్రయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిపై బైండ్ఓవర్ కేసులు పెట్టాం. నామినేషన్ ల ఉపసంహరణ గడువు ముగిసింది.. ఎంతమంది బరిలో ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నాం అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు.