రామోజీరావు ఇంట్లో పెళ్లిసందడి, హజరైన చంద్రబాబు

రామోజీరావు ఇంట్లో పెళ్లిసందడి, హజరైన చంద్రబాబు

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామోజీఫిల్మ్‌సిటీ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు తరలివచ్చారు. ఉదయం 11.58 గంటలకు వివాహబంధంతో ఒక్కటైన నూతన వధూవరులను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు. రామోజీరావు ఇంట్లో పెళ్లిసందడిలో పాల్గొనేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు.