పోలవరం ప్రాజెక్టు పై ఏపీ సీఎం సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పై ఏపీ సీఎం సమీక్ష

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ, పోలవరం కాపర్ డ్యామ్ నుంచి గ్రావిటీతో నీళ్లు ఇచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. భూ నిర్వాసితులు, పునరావస ప్యాకేజీకి కావాల్సిన నిధులను మార్చిలోగా సమకూరుస్తామని అన్నారు. రూ.2,472 కోట్ల మేర నిధులను నిర్వాసితులకు చెల్లించి గ్రావిటీతో నీరు అందించేందుకు లైన్ క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా సిబిఐపి ఇచ్చిన అవార్డును జనవరి నాలుగో తేదీన ప్రభుత్వం అందుకుంటుందని అన్నారు. తెలంగాణలోని తాజా మాజీ మంత్రులు చంద్రబాబును తిట్టడం మాని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తే మంచిదని హితువు పిలికారు. 20 రోజులైనా.. క్యాబినెట్ ఏర్పాటు చేసుకోలేని దుస్ధితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.