ప్రభుత్వానికి ప్రజలకు వారధి రేషన్ డీలర్లు

ప్రభుత్వానికి ప్రజలకు వారధి రేషన్ డీలర్లు

రేషన్ డీలర్లు ప్రభుత్వానికి,ప్రజలకు వారధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల ఆత్మీయ సదస్సులో ప్రసంగించిన సీఎం , డీలర్లకు రేషన్ పై ఐదు రెట్లు కమీషన్ పెంచామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆహార భద్రత మన రాష్ట్రంలో ఉందని చెప్పుకొచ్చిన సిఎం, ప్రభుత్వం చేసే మంచి పథకాలను ప్రజలకు డీలర్లు వివరించాలని సూచించారు. రాబోయే రోజులలో విలేజ్ మాల్స్ గా డీలర్ల షాపులు మారాలని ఆకాంక్షించారు. డీలర్ల అందరికి చంద్రన్న భీమా,ప్రభుత్వం పథకాలన్నీ వర్తింప చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.