30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపారు...

30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపారు...

ఎన్టీఆర్ బయోపిక్‌పై ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... గురువారం రాత్రి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వీక్షించిన ఆయన.. ఇవాళ అమరావతి నుంచి టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సినిమాపై ప్రస్తావించారు. తాజా రాజకీయాలపై నేతలతో చర్చించిన చంద్రబాబు... అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌పై మాట్లాడుతూ... 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపారని అభిప్రాయపడ్డారు. తన భావాలతో రాజీపడలేక ఉద్యోగాన్నే ఎన్టీఆర్ వదిలేశారని గుర్తు చేసిన చంద్రబాబు... సినీనటుడు కాగానే జోలపట్టి విరాళాలు సేకరించారని... తానే స్వయంగా విరాళం ఇచ్చి స్ఫూర్తి నింపారని వెల్లడించారు. ప్రభుత్వాలకు, సినీనటులకు, సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ప్రశంసించిన ఆయన.. తుపాన్లలో బాధితులను ఆదుకోవడం ఎన్టీఆర్ నేర్పిందే అన్నారు. గుడిసెల్లో నివసించే కుటుంబాల బాధ చూశారు... అందుకే కాంక్రీట్ శ్లాబుతో పేదలకు పక్కాఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు.