కాసేపట్లో దేవేగౌడతో చంద్రబాబు భేటీ

కాసేపట్లో దేవేగౌడతో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విపక్ష సభ్యులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అక్కడి నుంచి సాయంత్రం చంద్రబాబు బెంగళూరు బయలు దేరారు. రాత్రి 9.30 గంటలకు జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిని కలుసుకోనున్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన పరిణామాలను వారికి వివరించనున్నట్లు సమాచారం. రేపు చిత్తూరు జిల్లా కుప్పం రానున్నారు. అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతరలో సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారు.