ప్రతీ ఏడాది ఫార్ములా1 హెచ్2వో బోట్ రేసింగ్...

ప్రతీ ఏడాది ఫార్ములా1 హెచ్2వో బోట్ రేసింగ్...

ఇక ప్రతీ ఏడాది ఫార్ములా1 హెచ్2వో బోట్ రేసింగ్ నిర్వహిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని ప్రకాశం బ్యారేజీని జలక్రీడలకు శాశ్వత కేంద్రంగా మారుస్తామని ఆయన ప్రకటించారు. జల క్రీడలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ అద్భుతమైన ప్రాంతంగా అభివర్ణించిన సీఎం... అందుకే ఇక్కడ ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఫార్ములా1 హెచ్2వో బోట్ రేసింగ్‌ను 77 దేశాలలో 90 లక్షల మంది ప్రజలు వీక్షించారన్న చంద్రబాబు... రాష్ట్రంలో సహజమైన ప్రకృతి అందాలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి నెలలో వాటర్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. సర్వీస్ సెక్టర్లలో ప్రధానమైనది టూరిజమని... ప్రతీ నెల అమరావతిలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తామని... వ్యవసాయం, పరిశ్రమల కంటే అధికంగా ఉద్యోగాలు టూరిజంలో వస్తాయని తెలిపారు. 

నేను పెట్టిన ఎగ్జామ్‌లో టూరిజం డిపార్ట్‌మెంట్ విజయం సాధించాలన్న చంద్రబాబు... ఎఫ్‌1హెచ్‌2వో విజయవంతంగా నిర్వహించి ఏపీ టూరిజం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఈ పోటీల నిర్వహణ ద్వారా అమరావతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పామని... ఫార్ములా1 పోటీలు ఇక నుంచి ఏటా విజయవాడలో నిర్వహించాలని ఫార్ములా1 హెచ్2వో సంస్థను కోరారు. కాలెండర్ ఇయర్ ప్రకారం టూరిజం ఈవెంట్లు నిర్వహించాలని సూచించిన ఆయన... హైదరాబాద్ కు ఫార్ములా వన్ తీసుకు రావాలని ప్రయత్నం చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.