రాజోలు టిక్కెట్ పై స్పష్టత ఇచ్చిన బాబు

రాజోలు టిక్కెట్ పై స్పష్టత ఇచ్చిన బాబు

రాజోలు టిక్కెట్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ రోజు ఉదయం పెండింగులో ఉన్న గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై నేతలతో బాబు చర్చించనున్నారు. అనంతరం అమలాపురం, చిత్తూరు పార్లమెంట్ స్థానాలపై మధ్యాహ్నం మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పార్లమెంటు స్థానాలతో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం ఇదివరకే సమీక్ష నిర్వహించినప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో మళ్లీ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం హిందూపురం, అనంతపురం పార్లమెంట్ స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోగల అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించనున్నారు.