అమిత్ షా లేఖకు చంద్రబాబు కౌంటర్..

అమిత్ షా లేఖకు చంద్రబాబు కౌంటర్..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఏపీ ప్రజలకు రాసిన బహిరంగలేఖకు కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష విరమణలో ఆయన మాట్లాడుతూ.. నాది రైట్ టర్న్.. అమిత్ షాదే రాంగ్ టర్న్ అంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇవ్వడం లేదని.. నీతి ఆయోగ్ చెప్పిందంటూ అబద్దాలు చెప్పారని గుర్తుచేసుకున్నారు. భయంకరమైన వ్యక్తులు వీళ్లు అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా నేతలంతా ధర్మదీక్ష పోరాట వేదికపైకి వచ్చి ఏపీకి సంఘీభావం తెలపడం చాలా పెద్ద ఊరట కలిగించిందని, మోదీ అండ్ కో తప్ప అందరూ సంఘీభావం తెలిపారంటే ఇదొక చరిత్ర అని అన్నారు. విభజన హామీలు సహా, కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలబడాలని నేతలు గట్టిగా చెప్పారని, ఇప్పుడొక నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. అలాంటి బలం, భరోసా ఇచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు.