మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు..!?

మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు..!?

ఎన్డీయేతర పక్షాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తారని అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తూ.. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయపరిణామాలపై చర్చిస్తున్న చంద్రబాబు... ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారని సమాచారం. అమరావతిలో ఉన్న చంద్రబాబు... ఉదయం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.. అనంతరం హస్తినకు పయనం అవుతారని అంటున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడం.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సమయంలో.. మరోసారి ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు పర్యటనపై ఆసక్తి నెలకొంది.