'చంద్రబాబు ఎక్స్‌పైర్‌ అయిన ట్యాబ్‌లెట్..!'

'చంద్రబాబు ఎక్స్‌పైర్‌ అయిన ట్యాబ్‌లెట్..!'

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్‌లెట్... వేసుకోవడం వల్ల ఉపయోగం ఉందంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెర్వులో నిర్వహించిన వైసీపీ మహిళా స్వరం సభలో ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేసిన చంద్రబాబుకు పసుపు కుంకుమల విలువ తెలియదని మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ కి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని వ్యాఖ్యానించిన రోజా.. చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని మాత్రమే పారిశ్రామిక వేత్తగా మార్చారంటూ ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ మహిళను వైఎస్ జగన్ ఆదుకుంటారని తెలిపారు.