ఇంత విఫల ప్రధానిని చూడలేదుః చంద్రబాబు

ఇంత విఫల ప్రధానిని చూడలేదుః చంద్రబాబు

స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో దేశం చూసిన ప్రధాన మంత్రుల్లో అస్సలు జవాబుదారీతనం లేని ప్రధాని మోడీయే అని పత్రికారంగం కూడా చెబుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ట్విటర్‌లో ప్రధాని మోడీ పాలనపై ఘాటుగా విమర్శలు చేశారు. ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధానిగా మోదీ తప్ప మరెవరూ లేరంటూ ధ్వజమెత్తారు. దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీడియాతో చెప్పారని గుర్తు చేశారు.

దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి సాక్షాత్తూ రక్షణ శాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు(రాఫెల్) మాయం కావడం ఎప్పుడైనా జరిగిందా?.

బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఏటిఎంలను దిష్టిబొమ్మలుగా చేశారు. డిమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు. జిఎస్‌టి సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. రూపాయి విలువ దారుణంగా పతనం అయ్యింది. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదు అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.