మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సీఎం సెటైర్లు...

మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సీఎం సెటైర్లు...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు... విజయవాడలోని బెంజి సర్కిల్‌లో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రస్తావించారు. లక్ష్మీనారాయణ కూడా భారతీయ జనతా పార్టీ నేతలా మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. సీబీఐ జేడీగా ఉన్న సమయంలో పలు కీలక కేసులను డీల్ చేసిన లక్ష్మీనారాయణ... ఇంకా సర్వీస్ ఉన్నా వీఆర్ఎస్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్నప్పటి నుంచీ ఆయన ఆ పార్టీలో చేరతారు... ఈ పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చినా... ఆయన పొలిటికల్ ఎంట్రీ ఏ పార్టీలో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ప్రత్యక్షం కావడం చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే.