ప్రజలకు మేం అండ... మాకు ప్రజలు అండ...

ప్రజలకు మేం అండ... మాకు ప్రజలు అండ...

ప్రజలకు మేము అండగా ఉంటే... ప్రజలు మాకు అండగా ఉంటారు అనే విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... నెల్లూరు జిల్లా తాళ్వాయిపాడు గ్రామదర్శినిలో పాల్గొన్న ఏపీ సీఎం మాట్లాడుతూ... ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా తన ప్రభుత్వం చూస్తోందని గుర్తు చేసిన చంద్రబాబు... కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో అవస్థలు పడ్డారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని... ఎరువుల కొరత లేకుండా రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. రైతుల కోసం రుణ మాఫీతో పాటు నూతన విధానంలో ఎరువుల వాడకం లాంటి అనేక పథకాలను తీసుకు వచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్న చంద్రబాబు... ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అధికారులు పనిచేస్తున్నారని... దేశంలోనే నంబర్ వన్‌ టీమ్‌గా అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ సీఎం.