కుండ బద్దలు కొట్టిన చంద్రబాబు...

కుండ బద్దలు కొట్టిన చంద్రబాబు...

ముందుగా ఊహించినట్టుగనాఏ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో కుండ బద్దలు కొట్టేలా మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు... విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని తెలిపిన ఆయన... రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగిందని, న్యాయం చేస్తామని చెప్పిన కేంద్రం మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి నిధుల కొరతను కేంద్రం తీర్చాలని కోరారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేయాలని తెలిపారు. 

నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల నుంచి ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు... అయితే చంద్రబాబు ఏడు నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగించిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్... ఏపీ సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు... ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, సమస్యల తీవ్రత దృష్ట్యా మాట్లాడేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా 20 నిమిషాల పాటు నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.