పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభం...

పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది... ఎన్నో సంచలనాలు... మరెన్నో రికార్డులకు వేదికైన పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని... (పోలవరం గ్యాలరీ)ని ఈ రోజు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత పోలవరం గ్యాలరీ వాక్ నిర్వహించారు... ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా గ్యాలరీలో వాక్ చేశారు. 

ఈ రోజు ఉదయం ప్రత్యేక బస్సుల్లో అమరావతి నుంచి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు పోలవరం చేరుకోగా... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో పోలవరానికి వచ్చారు. పోలవరం గ్యాలరీ పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించారు. సీఎం చంద్రబాబు వెంట వచ్చి మనువడు పోలవరం ప్రాజెక్టు దగ్గర హల్‌చల్‌ చేవారు. మరోవైపు ప్రజాప్రతినిధులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలవరం గ్యాలరీ వాక్ దృష్ట్యా ప్రాజెక్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు..