శ్రీకాకుళం నేతలపై చంద్రబాబు సీరియస్..

శ్రీకాకుళం నేతలపై చంద్రబాబు సీరియస్..

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... సమీక్షల్లో భాగంగా ఇవాళ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంటుపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.. అయితే, ఈ సమవేశానికి శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గలకు చెందిన నేతలు హాజరయ్యారు. కానీ, శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి డుమ్మాకొట్టారు. కుటుంబ సభ్యుడు మరణంతో సమీక్షకు గుండా లక్ష్మీదేవి దూరంగా ఉండగా... ఎమ్మెల్యే రాలేదని సమీక్షకు మిగతా నేతలు కూడా హాజరుకాలేదు. దీంతో ఎమ్మెల్యే హాజరుకాకున్నా.. మిగతా నేతలు హాజరుకాకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమీక్ష సమావేశం ఉందని తెలిసి కూడా ఎందుకు రాలేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.