మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలవనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘం వద్ద తన అభ్యంతరాన్ని తెలపనున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు.