రాహుల్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ..

రాహుల్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ..

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. దాదాపు గంటపాటు ఈ ఇద్దరి నేతల సమావేశం జరిగింది. ఫలితాలు ఏ రకంగా రానున్నాయి? ఫలితాల తర్వాత వ్యూహాలు ఏ రకంగా ఉండాలి?, భవిష్యత్ కార్యాచరణ, పొత్తులు, చంద్రగిరిలో రీపోలింగ్ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. గతంలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి..? ఆయా పార్టీలతో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలపై కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం లక్నో వెళ్లనున్నారు చంద్రబాబు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్‌యాదవ్‌తో భేటీ అవుతారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా సమావేశమయ్యారు చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి ఇరువురు నేతల మధ్య చర్చ సాగింది.