పొగాకు ధరలపై చంద్రబాబు వాకబు...

పొగాకు ధరలపై చంద్రబాబు వాకబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు ధరలపై వాకబు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గురువారం సీఎంవో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పొగాకు ధరల  పతనంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు సీఎం. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని.. అవసరమైతే కేంద్ర మంత్రితో చర్చించాలని అధికారులను సీఎం చంద్రబాబు  ఆదేశించారు. అన్ని పంటల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని వారికి సూచించారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు నిన్ననే రూ.500కోట్లు విడుదల చేశామన్నారు. కందులు, మొక్కజొన్న రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.