వివేకా మృతిపై తక్షణమే స్పందించిన సీఎం

వివేకా మృతిపై తక్షణమే స్పందించిన సీఎం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఆయన హఠాన్మరణంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబీకులు వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్ర డీజీపీ, ఇంటలిజెన్స్, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేక మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. వివేకా కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.