మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ

మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 30 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య చర్చలు సాగాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు తిరుగు ప్రయాణం కావడం.. రేపు ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ లో జరుగనున్న ధర్నాలో పాల్గొనడానికి మమతా బెనర్జీ.. ఢిల్లీ చేరుకోవడంతో... ఇద్దరు నేతలు ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు.