శ్రీవారి సేవలో చంద్రబాబు..

శ్రీవారి సేవలో చంద్రబాబు..

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అమరావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయ ప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద ఇస్తకఫాల్ స్వాగతం పలికారు అర్చకులు. మనవడితో కలసి ఆలయ ప్రవేశం చేసిన చంద్రబాబు.. శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు వెంట సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, తదితరులున్నారు.