టీటీడీపై కేంద్రం కుట్ర....

టీటీడీపై కేంద్రం కుట్ర....

భారత దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌ గ్రౌండ్‌లో పసుపు పండుగ మహానాడును ప్రారంభించిన సీఎం... ప్రారంభోపన్యాసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం విభజన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు ఏపీ సీఎం... ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన... ఏపీకి అన్యాయం చేస్తున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తామన్నారు. 

మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తోందని ఆరోపించారు చంద్రబాబు... ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రచార ప్రధాని మాత్రమే... కానీ, మోడీ వల్ల ఏమీ జరగలేదని... ప్రతి అంశంలో ప్రచారం తప్ప ఇంకేమీ లేదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే మనపై కొందరిని రెచ్చి గొడుతున్నారంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు చంద్రబాబు... తిరుమల వెంకన్న వల్లే నా ప్రాణాలు నిలిచాయి... నాడు అలిపిరిలో బాంబు పేలుడు నుంచి ఓ పర్పస్ కోసమే దేవుడు కాపాడారనన్నారు. టీటీడీపై కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించిన చంద్రబాబు... నగలు మాయం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెంకన్నతో పెట్టుకొని ఎవరు బాగుపడలేదన్న విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని సూచించిన ఆయన... టీటీడీని ఆర్చియాలజీ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని... బీజేపీకి ఒక చెడు అలవాటు ఉంది... మాట వినక పోతే వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.