దాచేపల్లి ఘటనపై సీఎం సీరియస్...

దాచేపల్లి ఘటనపై సీఎం సీరియస్...

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కామంతో కళ్ళుమూసుకుపోయిన దుర్మార్గుడు అన్నం సుబ్బయ్య(50) అభంశుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడేవారిని సహించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా ఎస్పీ, ఐజీలను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. 

నిందితుడిని పట్టుకోవాలంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు హైవేపై పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. దీంతో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై దాదాపు 15 కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ఘటనను నిరసిస్తూ దాచేపల్లిలో స్థానికులు స్వచ్ఛంద బంద్‌ పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా దాచేపల్లిలో పోలీస్‌ బలగాలు భారీగా మోహరించారు. నిందితుడిని  పట్టిచ్చివారికి నగదు బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.