అశోక్ బాబు.. రాజకీయాల్లోకి వచ్చెయ్

అశోక్ బాబు.. రాజకీయాల్లోకి వచ్చెయ్

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ బెంజి సర్కిల్ లో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అశోక్ బాబు  రాజకీయాల్లోకి వచ్చేయ్.. అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  గత ఎన్నికల్లో కూడా అశోక్ బాబు తెదేపాకి మద్దతు పలికారు. ఆ తర్వాత మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా అశోక్ బాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని అశోక్ బాబు కించపరిచేలా మాట్లాడినందుకు బీజేపీ తిరుపతి నేత సామంచి శ్రీనివాస్‌.. ఆయనపై కర్ణాటక ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యోగుల తరఫున అశోక్ బాబు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా తెదేపా విజయానికి కీలక పాత్ర పోషించారు అశోక్ బాబు.