ఎగ్జిట్ పోల్స్‌పై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఎగ్జిట్ పోల్స్‌పై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో పోలింగ్ ముగిసింది. ఆదివారం పోలింగ్ సమయం ముగియగానే వివిధ ఛానెళ్లు వారు చేసిన సర్వేల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో వివిధ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయన్న చంద్రబాబు.. గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు వాస్తవానికి దూరంగా వచ్చాయన్నారు. ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని ధీమా వ్యక్తం చేసిన ఏపీ సీఎం.. కేంద్రంలో నాన్-బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం అన్నారు. ఇదే సందర్భంలో 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరుతున్నామన్న చంద్రబాబు.. ఈవీఎంలకు.. వీవీ ప్యాట్ల లెక్కింపునకు ఒక్క చోట తేడా వచ్చినా.. ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వీవీ ప్యాట్ల లెక్కింపు చేయాలని డిమాండ్ చేశారు.