ధర్మ పోరాట దీక్షను విరమించిన చంద్రబాబు

ధర్మ పోరాట దీక్షను విరమించిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షను విరమించారు. ఇద్దరు చిన్నారులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును పలువురు నేతలు అభినందించారు. కాగా... విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పన్నెండు గంటల పాటు చంద్రబాబు ధర్మ దీక్ష చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లోని మంత్రులు దీక్షలు చేపట్టారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా సమర శంఖం పూరిస్తూ... చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే.