కేజ్రివాల్‌కు చంద్రబాబు మద్దతు

కేజ్రివాల్‌కు చంద్రబాబు మద్దతు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ చేస్తున్న పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయకుండా  ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌ వ్యవస్థను వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌  అనిల్‌ బైజాల్‌తో భేటీ కోసం ముఖ్యమంత్రి కేజ్రివాల్‌  అయిదు రోజుల నుంచి గవర్నర్‌ ఇంటి వద్దే ధర్నా చేస్తున్నారు.