ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ...

ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరుగుతోన్న తాజా పరిణామాలు... ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రత్యక్ష కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన తర్వాత బీజేపీని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుండగా... మరోవైపు బీజేపీకి కూడా అదేస్థాయిలో టీడీపీపై ఎదురుదాడి చేస్తోంది. ఇక వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం... రాజీనామాల ఆమోదించడానికి ప్రయత్నించడం కూడా తెలిసిందే... ఈ సమయంలో టీడీపీ ఎంపీలు ఎలా ముందుకు వెళ్తారు... నేడు ఎంపీలకు చంద్రబాబు ఎలాంటి సూచనలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.