నేడు ఎస్‌.కోటలో చంద్రబాబు దీక్ష...

నేడు ఎస్‌.కోటలో చంద్రబాబు దీక్ష...

ఆంధ్రప్రదేశ్‌లో నవ నిర్మాణ దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి... నేడు విజయనగరం జిల్లాలో జరిగే దీక్షల్లో భాగంగా గ్రామ సభలు - గ్రామ దర్శిని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలాగే వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఇవాళ కార్యక్రమాలు జరుగుతాయి. నిన్న జరిగిన దీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది పాల్గొన్నారు. 49 వేల మందికి కొత్త రేషన్ కార్డులు, 37 వేల మందికి గృహాలు మంజూరయ్యాయి. నేడు విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్న ఏపీ సీఎం... జమ్ముదేవిపేటలో ఉదయం గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం శృంగవరపుకోటలో నవనిర్మాణ దీక్ష బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు.