తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారంపై తీవ్ర విమర్శలకు దారితీసింది.. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకోవడంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. అయితే, తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ నిర్వాకంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహరాన్ని ప్రస్తాఇంచారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయని గుర్తుచేసిన ఏపీ సీఎం.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇక విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు.. విద్యార్ధులు ఆత్మ స్ధైర్యంతో ఉండాలి... ఆత్మహత్యలు సరికాదన్నారు.