వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ...

వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ...

శ్రీవారి నగల విషయంలో విపక్షాల ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... హైదరాబాద్‌లో జరిగిన టి.టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ... వెంకన్న నగలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నవారికి అసలు బుద్ధిలేదని మండిపడ్డారు. తనకు ప్రాణభిక్ష పెట్టింది తిరుమల వెంకటేశ్వరస్వామేనన్నారు. నక్సలైట్లు 24 క్లైమోర్లు ప్రయోగించినా స్వామి దయ వల్ల తనకేం కాలేదని గుర్తు చేసుకున్నారు. ఏడుకొండలవాడి దగ్గర ఎవ్వరు నాటకాలు ఆడినా వారికి అదోగతి పడుతోందని ఘాటుగా స్పందించారాయన. బీజేపీ చేస్తున్న దుర్మార్గపు కార్యక్రమాలు చూస్తుంటే... వెంకటేశ్వర స్వామిని కూడా వివాదాల్లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఎవరితోనైనా పెట్టుకోండి... కానీ, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి అని సూచించిన ఏపీ సీఎం... ఏడుకొండల వాడితో పెట్టుకుంటే మీ పని ఖతం అని వ్యాఖ్యానించారు.