వివేకా హత్య కేసు: ఇవన్నీ ఎందుకు దాచారు?

వివేకా హత్య కేసు: ఇవన్నీ ఎందుకు దాచారు?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... వివేకా హత్యపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఉదయం 05.30 గంటలకు పీఏ వెళ్తే.. ఉదయం 06.40 గంటలకు అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. చనిపోయారని చెప్పారే తప్ప.. వేరే విధంగా చెప్పలేదన్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో ఆధారాలు దొరకకుండా అంతా సరిచేశారని విమర్శించారు చంద్రబాబు. బాత్‌రూమ్‌లో చనిపోయిన వివేకాను బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తెచ్చారు? రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు? ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా గుండెపోటు అనే ఎందుకు చెప్పారు? ఇంతగా చేయాల్సిన అవసరం ఏముంది..? ఎవర్ని షీల్డ్ చేయడానికి చేశారు ఇదంతా? ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లేంత వరకు ఎందుకు హైడ్ చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు. వివేకా డెడ్ బాడీ పడిన తీరు చూస్తుంటేనే మర్డర్ అని స్పష్టంగా తెలిసిపోతోంది.. కానీ, ఎందుకు గుండెపోటు అని చెబుతూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డ చంద్రబాబు.. నా మీద, లోకేష్ మీద, పార్టీ మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని కేసు కూడా అవసరం లేదని కూడా చెప్పారని ఆరోపించారు చంద్రబాబు.. కేసు కూడా అవసరం లేదని.. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఖండించిన చంద్రబాబు.. కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.