జడ్జి ఎదుట ప్రతిజ్ఞ చేయనున్న చంద్రబాబు 

 జడ్జి ఎదుట ప్రతిజ్ఞ చేయనున్న చంద్రబాబు 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున నామినేషన్ పత్రాలను శుక్రవారం టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు. ప్రచారంలో బిజీగా ఉండడంతో సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి నామినేషన్ వేయలేకపోయారు. నిబంధన ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రమాణం చేయని కారణంగా శనివారం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో వున్న నాల్గవ అడిషినల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.