జేఈఈ ర్యాంకర్స్‌కు చంద్రబాబు సత్కారం...

జేఈఈ ర్యాంకర్స్‌కు చంద్రబాబు సత్కారం...

ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌-2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే... ఏపీ, తెలంగాణలోని విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. అయితే ఐఐటీ జేఈఈల్లో ర్యాంక్స్ సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఈ రోజు అమరావతిలో విద్యార్థులను సత్కరించిన ఏపీ సీఎం... ఈ సందర్భంగా మాట్లాడుతూ... మట్టిలో మాణిక్యాలు వీరు... అవకాశాలు ఇస్తే ఎవరికన్నా తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వీరిలో సృజనాత్మకత చూస్తుంటే గర్వంగా ఉంది, భవిష్యత్తులో వీరంతా ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నాని తెలిపారు.