వారిలో టీడీపీ నేతలుంటే వేటు...

వారిలో టీడీపీ నేతలుంటే వేటు...

బీజేపీ చీఫ్ అమిత్‌షా కాన్వాయ్‌పై జరిగిన దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందినవారుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అమిత్‌షా కాన్వాయ్‌పై జరిగిన దాడిన ఖండించిన ఏపీ సీఎం... ఆ దాడి చేసినవారిలో టీడీపీ నేతలుంటే  పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించారు. అమిత్‌షా కాన్వాయ్‌ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన... టీడీపీ శ్రేణుల తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయొద్దని హెచ్చరించారు. క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు చంద్రబాబు. కాగా, ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అమిత్‌షా... తిరుగుప్రయాణం కాగా... అలిపిరి దగ్గర ఆయన కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులు యత్నించడం... రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే.