'ఫొని' తుపాను పై చంద్రబాబు సమీక్ష

'ఫొని' తుపాను పై చంద్రబాబు సమీక్ష

ఫొని తుపానుపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు.. 200 గ్రామాలపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని సీఎంతో విపత్తుల ప్రత్యేకాధికారి వరప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. 120 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సహాయక బృందాలు పనిచేస్తాయని స్పష్టంచేశారు. మండల కేంద్రాల్లో కాకుండా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో సహాయ బృందాలు అందుబాటులో ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అలాగే పాలు, తాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో తుఫాన్ బాధితులకు ఆహారం, ఇతర వసతులు కల్పించాలన్నారు. విశాఖ కేంద్రంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు పంపాలని సూచించారు. మరోవైపు ఒడిషా సీఎంతో సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఫొని తుపాను నేపథ్యంలో ఒడిషాకు సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.