ఇబ్బందుల్లోనూ వ్యవసాయంలో 17 శాతం వృద్ధి

ఇబ్బందుల్లోనూ వ్యవసాయంలో 17 శాతం వృద్ధి

రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా వ్యవసాయంలో 17 శాతం వృద్ధి  సాధించామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... 30 శాతం వర్షపాతం లోటు ఉన్నా... 3 మీటర్ల భూగర్భ జలాలు పెంచామని వెల్లడించారు. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలతోనే నీటిమట్టాలు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఊరూరా పశుగ్రాసక్షేత్రాలపై దృష్టిపెట్టాలని సూచించారు... పశుగ్రాసానికి భద్రత ఇస్తున్న రాష్ట్రం ఏపీఅని గోకులాలను త్వరగా ప్రారంభించాలన్నారు. 525 గ్రామాలకు తాగునీరు రవాణా అవుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు ఏపీ సీఎం. ప్రకాశంలో ఇంజక్షన్ వెల్స్‌తో సత్ఫలితాలు ఉన్నాయని తెలిపారు.