'తిత్లీ' సహాయక చర్యలపై సీఎం సమీక్ష...

'తిత్లీ' సహాయక చర్యలపై సీఎం సమీక్ష...

తిత్లీ తుఫాన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు... తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పనుల్లో 10వేల మంది పనిచేస్తున్నారని... 1,369 గ్రామాలకు విద్యుత్ పునరుద్దరించాం... ఇంకా 433 గ్రామాలకు విద్యుత్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. హెబిటేషన్లతో కలుపుకుని 1,430 ప్రాంతాల్లో కరెంట్ ఇవ్వాల్సి ఉందన్న సీఎం... ఈ ప్రాంతాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా పనులు చేయాలని ఆదేశించారు. హార్టీకల్చర్ మినహా ఎన్యూమరేషన్ అంతా పూర్తయ్యిందన్న ఏపీ సీఎం... అగ్రికల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ నష్టం అంచనాలు పూర్తయ్యాయని... హార్టీకల్చర్ ఎన్యూమరేషన్ కూడా రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని సూచించారు.

ఆర్టీసీ బస్సు సర్వీసులన్నీ పునరుద్దరించారని తెలిపారు చంద్రబాబు. టెలికం కనెక్టివిటీ 99.7శాతం పూర్తిచేశామన్నారు. గార, కోటబొమ్మాళిలో భోజనం పంపిణీ మరింత పకడ్బందీగా చేయాలని సూచించిన సీఎం... తుఫాన్‌ పీడిత గ్రామాల దత్తతకు దాతలు ముందుకు వస్తున్నారని... స్మార్ట్ ఏపీ ఫౌండేషన్, సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారని, తిత్లీ ఉద్దానం రికనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్(తూర్పు)కు స్పందన బాగా ఉందన్నారు చంద్రబాబు. డయాలసిస్, కిడ్నీ వ్యాధులకు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు... శ్రీకాకుళంలో హార్టీకల్చర్ రిసెర్చ్‌ యూనిట్ పెట్టేందుకు ముందుకు వస్తున్నారని... శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్‌ సమస్యలే కాకుండా... ఇతర సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తున్నామని వెల్లడించారు.