ముస్లింలకు మంత్రి పదవిపై కసరత్తు...

ముస్లింలకు మంత్రి పదవిపై కసరత్తు...

ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఏపీ నుంచి హజ్ యాత్రకు 2,348 మంది ముస్లిం మైనార్టీలు వెళ్తుండగా... వారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం... 2019లో గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్ కు విమానాలు నడుస్తాయని తెలిపారు. కడపలో రూ.12 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతోందన్న సీఎం... విజయవాడలో రూ. 80 కోట్లతో హజ్ హౌస్ కు శంకుస్థాపన చేశామని... ముస్లింల అభ్యున్నతికి ఈ బడ్జెట్ లో రూ.1100 కోట్లు కేటాయించామని వెల్లడించారు. 

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇమాంలు, మౌజన్ లకు జీతాలు ఇస్తున్నామన్నారు చంద్రబాబు... దీనికి బడ్జెట్ లో రూ.75కోట్లు కేటాయించాంమని... 225 షాదీఖానాల నిర్మాణానికి రూ.20 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు. మరో 20 కోట్లతో మసీదులకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపిన సీఎం... మన రాష్ట్రం బాగుండాలని అల్లాను ప్రార్ధించండి అని సూచించారు. భూములు కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం... వక్ఫ్ భూములను కాపాడతాం. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.