వారానికో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు

వారానికో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు

ఈ నెల 17 నుంచి వారానికో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై అమరావతి నుంచి చంద్రబాబు మాట్లాడుతూ... రెండు కోట్ల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో పని చేయాలన్నారు. పలు ప్రోజెక్టుల పనులు తుది దశకు చేరుకున్నాయి. పూర్తయిన ప్రాజెక్టులకు వరుస ప్రారంభోత్సవాలు జరిపేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న 57 ప్రాజెక్టులలో 10 పూర్తయ్యాయని.. మరో 5 ప్రాజెక్టుల నిర్మాణం తుది దశలో ఉందని తెలిపారు. తాగు, సాగు, పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూస్తామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును 73 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసాం. 26 సాసర్లు సైట్ ఇన్స్పెక్షన్ చేసాం. మొత్తం ప్రాజెక్ట్ 58 శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలో మిగిలిన వాటిని పూర్తిచేస్తామని బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానం కూడా ఈ సంవత్సరమే చేపట్టనున్నామన్నారు. రాయలసీమలో ఈ ఏడాది 60 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వలనే ఈ రోజు అన్ని జలాశయాల్లో నీళ్లు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.