నూటికి నూరు శాతం మనదే ప్రభుత్వం..

నూటికి నూరు శాతం మనదే ప్రభుత్వం..

ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ నెల 23వ తేదీ తర్వాత నూటికి నూరు శాతం మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... అమరావతి నుంచి ఇవాళ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో  మన గెలుపును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ఈ సారి 18 నుంచి 20 ఎంపీ స్థానాలు మనం గెలుస్తున్నాం.. 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుంది.. అది 120-130 వరకూ వెళ్లొచ్చు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు. అంతా అప్రమత్తంగా ఉండాలి.. 22వ తేదీన కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోమారు శిక్షణ ఇస్తామని తెలిపారు చంద్రబాబు.