'ఎప్పుడూ ఓ కన్ను వేయాలి..'

'ఎప్పుడూ ఓ కన్ను వేయాలి..'

ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ప్రత్యర్ధుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలి.. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్ధుల సంస్కృతి, ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లే సీన్ క్రియేట్ చేస్తారు.. వాళ్లే దుష్ప్రచారం చేస్తారు.. ఫొటోలు మార్పింగ్ చేస్తారు.. వీడియో కటింగ్ లు చేస్తారు.. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్ధంగా ఎదుర్కోవాలని పార్టీ నేతలను అప్రమత్తం చేశారు చంద్రబాబు. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్న ఆయన.. నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తత కావాలన్నారు. ఈ ఎన్నికల్లో మనం పోటీబడేది నేరస్థులతో.. చేయని తప్పులు మనపై రుద్దుతారు.. తప్పులు జరిగేలా స్కెచ్ లు వాళ్లే వేస్తారని.. వాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

నవ్యాంధ్ర రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేవారని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. వెంటనే నేను ఖండిస్తే వెనక్కి పోయారన్నారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ..? అని ప్రశ్నించిన టీడీపీ అధినేత.. రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారు. రైతులు వినకపోతే విధ్వంసాలకు తెగబడ్డారని మండిపడ్డారు. అరటి తోటల ధ్వంసం, చెరకు తోటలు తగులబెట్టడం, రైతుల పొలాల్లో బోర్లు ధ్వంసం చేయడం అందులో భాగమే నని ఆరోపించారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారని విమర్శించిన చంద్రబాబు.. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసీపీయే నని ఆరోపించిన ఏపీ సీఎం.. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబని వ్యాఖ్యానించారు.