వైసీపీ సైకో పార్టీగా మారింది: చంద్రబాబు

వైసీపీ సైకో పార్టీగా మారింది: చంద్రబాబు

వైసీపీ సైకో పార్టీగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ రోజు ఆయన అమరావతిలో టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీకి వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటూ పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే వైసీపీ సైకో ధోరణన్నారు. పించన్ల సభలు భగ్నం చేయడం సైకో పోకడ, పసుపు-కుంకుమ భగ్నం చేయడం జగన్ శాడిజమన్నారు. బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని తెలిసి జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్ళాడు. ప్రధాని మోడీ కనుసన్నల్లో తాను ఈసీని కలిసి ఏదో ఫిర్యాదు అని నాటకమాడుతున్నారని సీఎం మండిపడ్డారు.

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ఫిర్యాదులు చేస్తోంది. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అవగాహన పెంచాలని పార్టీ నేతలకు ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు. తిరుపతిలో గోవింద రాజుల స్వామి ఆలయంలోని చోరీ ఉపేక్షించం. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నవ్యాంధ్రలో నవశకం నిన్న హైకోర్టు నిర్మాణంతో చాటాం. అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం అన్నారు.